Hero Srikanth కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. అలిపిరి నుంచి కాలి నడకన ఒక్కో మెట్టుకు బొట్టు పెడుతూ రోషన్ తన కుటుంబంతో సహా తిరుమలకు చేరుకున్నారు. మార్గమధ్యంలో భక్తులు రోషన్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. రోషన్ హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సంద D సినిమాల్లో నటించారు.